బుల్లితెరపై చిరంజీవి 'సైరా' ఎందుకు విఫలమైంది.?

బుల్లితెరపై చిరంజీవి సైరా ఎందుకు విఫలమైంది.?
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా సైరా సినిమా అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా సైరా సినిమా అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ అయితే సంపాదించుకుంది కానీ ఆశించిన వసూళ్లును మాత్రం సాధించలేకపోయింది. తాజాగా ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ఓ ఛానల్ లో ప్రసారం చేసింది. ఈ సినిమాకి 20 టీఆర్పీ సాధిస్తుందని అంచనా వేసిన సదరు ఛానల్ కి బిగ్ షాక్ ఇస్తూ .. కేవలం 11.8 టీఆర్పీ మాత్రమే సాధించగలిగింది. దీంతో `సైరా`ను ప్రదర్శించిన చానెల్‌కు నిరాశే మిగిలింది.

అయితే దీనికి గల కారణాలు లేకపోలేదని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నెల రోజులకే సైరా ఒరిజినల్ వర్షన్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెట్టేయడంతో ఈ రేటింగ్స్‌ పైన ప్రభావం పడిందని అంచనా వేస్తున్నారు. వెండితెరపై చూసేయడం, సినిమా కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండడంతో మళ్లీ సినిమాని బుల్లితెరపై వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధపడలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సినిమాని తమిళనాట ప్రసారం చేస్తే అక్కడ రికార్డు స్థాయిలో 15.44 టీఆర్పీ సాధించడం విశేషం..

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోకాపేటలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories