బిగ్ బాస్ హౌస్ ని భాగోద్వేగంతో నింపేసిన పునర్నవి ...

బిగ్ బాస్ హౌస్ ని భాగోద్వేగంతో నింపేసిన పునర్నవి ...
x
Highlights

బిగ్ బాస్ అంటే ఎప్పుడు గొడవలేనే , కాంట్రవర్సీలేనే అనుకునే వాళ్ళకి కొత్తగా కనిపించింది నిన్నటి ఎపిసోడ్ .. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరినైనా...

బిగ్ బాస్ అంటే ఎప్పుడు గొడవలేనే , కాంట్రవర్సీలేనే అనుకునే వాళ్ళకి కొత్తగా కనిపించింది నిన్నటి ఎపిసోడ్ .. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరినైనా కోల్పోయి ఉంటే షేర్ చేసుకోవాలని బిగ్ బాస్ కోరాడు . అయితే ఎవరి ఫీలింగ్స్ వారు చెప్పుకొచ్చారు . అందులో పునర్నవి తన జీవితంలో చోటు చేసుకున్న ఓ సంఘటనను చెబుతూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది . అంతే కాకుండా మొత్తం బిగ్ బాస్ హౌస్ ని కూడా ఎమోషనల్ తో నింపేసింది .

"నేను మొదటగా ఓ అబ్బాయిని ప్రేమించాను . అతను నన్న కొట్టేవాడు . దీనితో అతని నుండి నేను విడిపోయాను. అ తర్వాత చాలా రోజులు నేను డిప్రెషన్ కి లోనయ్యాను . మా అమ్మ నేను ఒకే ఇంట్లో ఉన్నా మాట్లాడుకోలేదు .ఇలాంటి టైం లో నాకు రామ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పరిచయం నాకు గతాన్ని మరిచిపోయేలా చేసింది . అతను నన్ను బాగా చూసుకునేవాడు .కొద్దిరోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది . అతను నన్ను కన్విన్స్ చేసేందుకు బాగా ట్రై చేసాడు. కానీ నా మొండితనం మరియు కోపం వల్ల అతనికి దూరంగా ఉన్నాను . అతను కొలంబోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడని తెలుసుకొని చాలా షాక్ కి గురయ్యాను .. అతని చావుతో నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పుకుంటూ పునర్నవి చెబుతూ చాలా ఎమోషనల్ కి గురయ్యింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories