రెండో రోజు కూడా అదరగొట్టిన భీష్మ.. ఓ రేంజ్ లో కలెక్షన్స్

రెండో రోజు కూడా అదరగొట్టిన భీష్మ.. ఓ రేంజ్ లో కలెక్షన్స్
x
Bheeshma ( File Photo)
Highlights

శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సినిమాని చేశాడు హీరో నితిన్... పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల...

శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సినిమాని చేశాడు హీరో నితిన్... పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, సీతార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది. సినిమాకి మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది.

ఆడియన్స్ నుంచి రివ్యూలు వరకు ఎక్కడ చూసిన అసలు జనాలు సీట్లలో కూర్చుంటేగా అన్నట్టుగానే సాగింది. అడుగడుగునా పంచెస్ తో,బ్యాక్ బ్యాక్ హిలేరియస్ సీన్స్ తో కితకితలు పెట్టి కామిడీ సన్నివేశాలు, నితిన్ డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని వేటికవే సమానంగా నిలిచాయి. దీనితో సినిమా మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.6 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 8.10కోట్లు అని సమాచారం.. ఇదే నితిన్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ గా రికార్డు సృష్టించాయి. ఇక రెండో రోజు కూడా ఈ సినిమా అదే జోరును కనబరిచింది. మొత్తం ఈ రెండు రోజుల్లో ఈ సినిమా 12.80కోట్ల షేర్‌ను, 19.30కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకి దాదాపుగా 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం 12.80కోట్ల షేర్‌ను, 19.30కోట్ల గ్రాస్‌ను రాబట్టింది కనుక మరో రెండో మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం టాక్ కూడా బాగా రావడంతో సినిమాకి మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories