భీష్మ రాంగ్ టైమ్ రిలీజ్.. 10కోట్ల నష్టం!

భీష్మ రాంగ్ టైమ్ రిలీజ్.. 10కోట్ల నష్టం!
x
Bheeshma movie
Highlights

సినిమాకి కథ, నటినటులు, నిర్మాత ఇవ్వన్ని ఎంత ముఖ్యమో సినిమా విడుదల తేది కూడా అంతే ముఖ్యం.. సినిమా రిలీజ్ టైంని బట్టి కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి.

సినిమాకి కథ, నటినటులు, నిర్మాత ఇవ్వన్ని ఎంత ముఖ్యమో సినిమా విడుదల తేది కూడా అంతే ముఖ్యం.. సినిమా రిలీజ్ టైంని బట్టి కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి సినిమా ఎలా ఉన్నప్పటికీ రిలీజ్ సమయాన్ని బట్టి అడేస్తుంది.. ఇంకొన్ని సినిమాల్లో కంటెంట్ ఉన్నప్పటికీ అవి అడవు.. అలా ఫ్లాప్ అయిన సినిమాలు కొకల్లలే ఉన్నాయి. వాటిని పక్కన పెడితే తాజాగా సరైనా టైంకి రిలీజ్ అయి మంచి వసూళ్ళును సాధించిన చిత్రాలేంటో చూద్దాం..

గత ఏడాది డిసెంబర్ లో మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా వచ్చిన ప్రతిరోజూ పండగే మంచి వసూళ్లను సాధించింది. ముందు నుంచి సినిమాకి హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకి 25 కోట్ల వరకూ రాబడుతుందని అందరు అనుకున్నారు కానీ పోటిగా వచ్చిన బాలకృష్ణ సినిమా రూలర్ ఆకట్టుకొకపోవడంతో సినిమాకి పోటి లేకుండా పోయింది. ఈ నేపద్యంలో ఎవరు ఉహించనంతగా 35 కోట్లను కొల్లగొట్టింది. దీనితో నిర్మాతలకు డబల్ ప్రాఫిట్స్ దక్కాయి. ఇక అంతకుముందు వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన వెంకీ మామ పరిస్థితి కూడా అంతే అనిన్ చెప్పాలి.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 40 కోట్ల మేర వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది.

ఇక హీరో నితిన్ తాజాగా నటించిన భీష్మ సినిమా విషయానికి వస్తే మొదటి షో నుంచే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఆడియన్స్ నుంచి రివ్యూల వరకు అంతా పాజిటివ్ గానే నడిచింది. కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి.. కానీ సరైనా టైంలో రిలీజ్ లేకపోవడంతో ఈ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. నిజానికి ఫిబ్రవరి మొదటి వారం నుండి మార్చ్ రెండవ వారం వరకూ సినిమాలకు అన్ సీజన్ అని చెబుతారు. పరీక్షల సీజన్ కావడంతో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపారు

దీనితో ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 26 కోట్ల వరకూ వసూలు చేసింది. ఒకవేళ ఈ సినిమా క్రిస్మస్ కి లేదా మార్చ్ నెలాఖరుకు వచ్చుంటే ఈ సినిమాకి మరో 10 కోట్ల రూపాయలు వచ్చేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories