లక్కి ఛాన్స్ కొట్టేసిన 'భీష్మ' డైరెక్టర్ .. ఏకంగా సూపర్ స్టార్ తోనే సినిమా?

లక్కి ఛాన్స్ కొట్టేసిన భీష్మ డైరెక్టర్ .. ఏకంగా సూపర్ స్టార్ తోనే సినిమా?
x
Mahesh Babu, Venky kudumula (File photo)
Highlights

నాగశౌర్య హీరోగా వచ్చిన 'ఛలో' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు దర్శకుడు వెంకీ కుడుముల.. మొదటిసినిమా మంచి విజయం సాధించడంతో

నాగశౌర్య హీరోగా వచ్చిన 'ఛలో' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు దర్శకుడు వెంకీ కుడుముల.. మొదటిసినిమా మంచి విజయం సాధించడంతో వెంటనే మరో సినిమా చేయకండా గ్యాప్ తీసుకొని పక్కా స్క్రిప్ట్ తో 'భీష్మ' తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి పేరును తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ దర్శకుడికి స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ వచ్చింది. అందులో భాగంగానే చాలా మంది హీరోల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ దర్శకుడికి సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

తాజాగా మహేష్ బాబు భీష్మ సినిమాని వీక్షించారు. సినిమా బాగా నచ్చడం, వెంకీ టేకింగ్ తో సినిమాని హిట్ మెట్టు ఎక్కించడంతో తనకు సెట్ అయ్యేలా ఓ మంచి కథను కూడా సిద్ధం చేయమని వెంకీని మహేష్ కోరినట్టు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వెంకీ అదే పనిలో ఉన్నాడట! అన్ని అనుకునట్టుగా జరిగితే మహేష్ ని డైరెక్ట్ చేసే వెంకీకి దగ్గరలోనే ఉందన్నమాట! ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని వీక్షించి, దర్శకుడిని అభినందించిన సంగతి తెలిసిందే..

ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలో సినిమా పట్టలేక్కనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories