రివ్యూ : భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు

రివ్యూ : భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు
x
శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్
Highlights

రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయం అయ్యాడు శ్రీనివాస్ రెడ్డి.

రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయం అయ్యాడు శ్రీనివాస్ రెడ్డి.. ఆ తర్వాత హీరోగా మారి గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాలో నటించి హిట్టు కొట్టాడు. ఇప్పుడు దర్శకుడిగా, నిర్మాతగా మారి భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు అనే సినిమా చేశాడు. 'మంచి రసగుల్లా లాంటి సినిమా' అనేది ఉపశీర్షిక.. మరి ఈ సినిమాతో దర్శకుడిగా శ్రీనివాస్ రెడ్డి సక్సెస్ అయ్యాడా లేదా అన్నది మన రివ్యూలో చూద్దాం..

కథ :

శ్రీను (శ్రీనివాసరెడ్డి), సత్య (జోజో), షకలక శంకర్ (పీటర్) ముగ్గురు మంచి స్నేహితులు..వీరికి నటన అనే పిచ్చి.. డబ్బులు లేకపోయినా అవకాశాల కోసం బాగానే ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ యుట్యూబ్ ఛానల్ లో నటించే అవకాశం వస్తుంది. డెమోలో భాగంగా ఓ అమ్మాయి కూడా ఉంటే బాగుంటుందని సదరు యుట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పడంతో కోకిల(డాలీ షా) అనే పిచ్చి అమ్మాయిని తీసుకువచ్చి ఫిల్మ్ డైరెక్టర్ దగ్గరికి తీసుకువెళతారు.

ఈ క్రమంలో శ్రీనుకి భూటాన్ లాటరీలో రెండు కోట్లు ప్రైజ్ మనీ వస్తుంది. కానీ, టికెట్ మాత్రం కనిపించదు. ఆ టికెట్ కోసం వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో శ్రీను, జోజో, పీటర్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అవుతారు.. అసలు వీరు అందులో ఎందుకు ఇరుకున్నారు. ఆ కోకిల కథ ఏమైంది? భూటాన్ లాటరీలో గెలుచుకున్న డబ్బులు వచ్చాయా? లేదా ? అంటే సినిమా చూడాల్సిందే..

ఎలా ఉందంటే ?

బేసిక్ గానే శ్రీనివాస్ రెడ్డి మంచి హాస్యనటుడు కావడంతో మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటులను ఎంచుకొని సన్నివేశాలు రాసుకున్నాడు కానీ వాటిని తెరకెక్కించడంలో మాత్రం విఫలం అయ్యాడని చెప్పాలి. తల తోకా లేని సన్నివేశాలతో సినిమా మొదటి భాగాన్ని నడిపించాడు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి.. దీనితో స్క్రీన్‌పై చాలా మంది కమెడియన్స్ కనిపిస్తున్నా నవ్వుకోలేని పరిస్థితి ప్రేక్షకుడికి ఎదురవుతుంది. ఇక మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగం పర్వాలేదని అనిపిస్తుంది.. శకలక శంకర్ కామెడి సినిమాకి ప్లస్ అయింది. పోలీస్ స్టేషన్ లో జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక ఉహించిన విధంగానే క్లైమాక్స్ కూడా ఒక చిన్న ట్విస్ట్‌తో ముగుస్తుంది.. దీనితో ఓ కమెడియన్ గా సక్సెస్ అయిన శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడని అని అనిపించక మానదు.

నటినటులు:

ఎప్పటిలాగే శ్రీనివాస్ రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దానికితోడు సత్య, షకలక శంకర్, వెన్నెల కిషోర్ లాంటి స్ట్రాంగ్ కమెడియన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కానీ వారిని ఇంకా వాడుకొని ఉంటే మరింత కామెడి క్రియేట్ అయి ఉండేది. సినిమాలో హీరోయిన్ పాత్ర మొత్తానికే తెలిపోయింది. ఇక సాంకేతిక నిపుణులు ఒకే అనిపించారు. మొత్తానికి ఛేదు రసగుల్లాగా సినిమా మిగిలిపోయింది.

గమనిక : సినిమా రివ్యూ ఒక ప్రేక్షకుడికి మాత్రమే సంబంధించినది. పూర్తి సినిమాని ధియేటర్ కి వెళ్లి చూడగలరు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories