'సంక్రాంతి సినిమా' పందాలు

సంక్రాంతి సినిమా పందాలు
x
Highlights

సంక్రాంతి పండగంటే పిండివంటలు, కోడిపందేలు మాత్రమే కాదు సినిమాలు కూడా... ఈ పండగ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచుతుందని చెప్పాలి.

సంక్రాంతి పండగంటే పిండివంటలు, కోడిపందేలు మాత్రమే కాదు సినిమాలు కూడా... ఈ పండగ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచుతుందని చెప్పాలి. వినోదం అంటే ఇంటిముందు ఆడపిల్లలు వేసే ముగ్గులు కావచ్చు. పెద్దవాళ్ళు కాసే పందేలు కావచ్చు. ఇంటికి వచ్చిన బంధువులను ఆటపట్టించడం కావచ్చు. ఏదైనా సరే వినోదభరితంగా ఈ పండగ అందరి ఇళ్ళల్లో సంతోషాలను నింపుతుంది.

ఇక సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు ఈ సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో రజినీకాంత్ 'దర్బార్', మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో', కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాల మధ్య పోటి వీపరీతంగా ఉంది. ఈ పోటీని తట్టుకొని ఏ సినిమా ఈ ఏటి సంక్రాంతి సినిమాగా నిలబడుతుంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో మా హీరో హిట్టు కొట్టడం ఖయమంటే మా హీరో హిట్టు కొట్టడం ఖయమంటూ హీరోలను పందెపు పుంజులుగా చేసి లక్షలాది రూపాయల పందేలు కాస్తున్నారు. ప్రతి పండగకి ఇది సాధారణమైన విషయమే..

ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలలో రజినీకాంత్ దర్బార్ సినిమా పరబాష చిత్రం కావడంతో ప్రధాన పోటి మాత్రం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాల మధ్య పోటి బాగా ఉండబోతుందని అర్ధం అయిపొయింది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ట్రైలర్, టీజర్ ఈ సినిమాలపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా మొదలు నుండి సినిమా ప్రమోషన్స్ వరకు సినిమాపైన చాలా హైప్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే ఈ సినిమాలకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందని, ఎ మాత్రం బాగున్నా సరే సినిమాలు హిట్టు కొట్టడం ఖాయమని తెలుస్తుంది.

ఇక ఈ రెండు పెద్ద సినిమాల మధ్య నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాతో ఈ నెల 15 ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమా కావడంతో ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఈ మాత్రం బాగున్నా సరే మిగతా సినిమాలకి పోటి ఇవ్వడం, సంక్రాంతి సినిమాగా నిలబడడం కూడా ఖాయమే.. సంక్రాంతికే వచ్చిన కళ్యాణ్ రామ్ పటాస్, దర్శకుడు సతీష విగ్నేశ సినిమాలు సంక్రాంతికి హిట్టు అయిన సంగతి తెలిసిందే. మరి చూడాలి ఈ సంక్రాంతికి ఏసినిమా హిట్టు కొడుతుందో..

ఈ సినిమాలపైన అభిమానులు ఎలా పందేలు కాస్తున్నారో ఈ వీడియోలో చూడండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories