టోటల్ లుక్ చేంజ్ చేసిన బెల్లంకొండ

bellamkonda sai srinivas
x
bellamkonda sai srinivas
Highlights

ఈ సినిమా మంచి హిట్టు కావడంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బెల్లంకొండ.. అందులో భాగంగానే కందిరీగ దర్శకుడు

అల్లుడు శీను సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ సినిమా హీరోగా సాయి శ్రీనివాస్ ఒకే అనిపించినా నిలదొక్కుకునే హిట్టును మాత్రం అందించలేకపోయింది. ఆ తర్వాత చాలా మంది స్టార్ డైరెక్టర్ లతో సినిమాలు చేశాడు బెల్లంకొండ.. ఇక తమిళ్ మూవీ రాక్షసన్ ని తెలుగులో రాక్షసుడు అనే పేరుతో తీసి మంచి హిట్టు కొట్టాడు.

ఈ సినిమా మంచి హిట్టు కావడంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బెల్లంకొండ.. అందులో భాగంగానే కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చెప్పిన యాక్షన్ కథకి ఒకే చెప్పాడు. ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుంది. అయితే ఈ సినిమా కోసం మొత్తం లుక్ నే మార్చేసాడు బెల్లంకొండ.. . గడ్డం పెంచి, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది.

సంతోష్ శ్రీనివాస్, బెల్లంకొండ సినిమా డిసెంబర్ నుండి పట్టలేక్కనుంది. ఇందులో హన్సిక కథానాయకగా నటిస్తుందని తెలుస్తుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories