లిటిల్ బాస్ మరో అవకాశం ఇవ్వండి : బండ్ల గణేష్

లిటిల్ బాస్ మరో అవకాశం ఇవ్వండి : బండ్ల గణేష్
x
Highlights

బండ్ల గణేష్.. ఓ హాస్య నటుడుగా సినిమా వెండితెరకి పరిచయం అయి ఓ బడా నిర్మాతగా మారారు.. ఆంజనేయులు, గబ్బర్ సింగ్, బాద్షా,గోవిందుడు అందరివాడేలే లాంటి...

బండ్ల గణేష్.. ఓ హాస్య నటుడుగా సినిమా వెండితెరకి పరిచయం అయి ఓ బడా నిర్మాతగా మారారు.. ఆంజనేయులు, గబ్బర్ సింగ్, బాద్షా,గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాలతో మంచి హిట్లను అందుకున్నాడు. ఆ తర్వాత నిర్మాణ రంగాన్ని పక్కన పెట్టి రాజకీయల్లోకి వచ్చారు. ఆ తర్వాత రాజకీయాలను వదులుకొని మళ్ళీ సినిమాల్లో హాస్యనటుడుగా కనిపించనున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నికేవ్వురు సినిమాలో బండ్ల గణేష్ ఓ మెయిన్ రోల్ లో కనిపించనున్నారు. ఇదే కాకుండా సినిమాలని నిర్మించాలని ఆలోచనలో కూడా బండ్ల ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపద్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాని తీయాలని ఉందని , అయన అవకాశం ఇవ్వాలని తన ట్విట్టర్ వేదికగా అడిగాడు గణేష్. "మళ్లీ మీ తో ఓ సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఆ అవకాశం లిటిల్ బస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్" అంటూ పోస్ట్ చేసాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గోవిందుడు అందరివాడేలే అనే సినిమా వచ్చింది. ఈ సినిమా 2014 అక్టోబరు 1న విడుదలైంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories