Top
logo

బండ్ల గణేష్ కి అంత పారితోషికమా?

బండ్ల గణేష్ కి అంత పారితోషికమా?
X
Highlights

కమెడియన్ గా సినీ కెరీర్ ని మొదలు పెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ హీరోల సినిమాలను నిర్మించాడు.

కమెడియన్ గా సినీ కెరీర్ ని మొదలు పెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి స్టార్ హీరోల సినిమాలను నిర్మించాడు. అందులో భాగంగానే గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి సినిమాలు వచ్చాయి. ఇక గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరి కొన్ని రోజులకి పూర్తిగా రాజకీయాలకి పూర్తిగా రాజీనామా చేశారు. ఎన్నికలప్పుడు అయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే అదే కామెడీని తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి

సరిలేరు నీకెవ్వరు సినిమాలో అయన ఓ దొంగ పాత్రలో నటించారు. సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాల్లో బండ్ల గణేష్ ఓ పది నిముషాలు కనిపిస్తారు. కానీ అక్కడ అయన కామెడీ అంతగా పండలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ పాత్ర కోసం అయనకి 20 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది.

ఇక సినిమా విషయానికి వచ్చేసరికి పక్కా కమర్షియల్ ఫార్ములాగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ రోల్ లో కనిపించారు. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీ ఇస్తూ భారతి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సంక్రాంతి పండగ సందర్బంగా జనవరి 11 న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకొని దూసుకుపోతుంది.

Web TitleBandla Ganesh remuneration for Sarileru Neekevvaru movie
Next Story