Top
logo

పవన్ కళ్యాణ్..బోయపాటి కాంబినేషన్లో బండ్ల గణేష్ భారీ సినిమా?

పవన్ కళ్యాణ్..బోయపాటి కాంబినేషన్లో బండ్ల గణేష్ భారీ సినిమా?
X
Highlights

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ప్రపంచంలో ఓ సంచలనం. ఒక్కసారి తెర మీద కనిపిస్తే చాలు జనం పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. ...

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ప్రపంచంలో ఓ సంచలనం. ఒక్కసారి తెర మీద కనిపిస్తే చాలు జనం పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. పవర్ స్టార్ గా పవర్ చూపించిన పవన్ రాజకీయాలలో చేరి జనసేన పార్టీ స్థాపించారు. ఇటీవలి ఎన్నికల్లో అనుకోని పరాజయం పొందారు. ఇప్పటికే సినిమాలకు బై చెప్పిన పవన్ కళ్యాణ్.. ఒక సినిమా చేయబోతున్నారని ఫిలిం వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఎన్నికలు పూర్తయిపోవడం.. తానూ అభిమానులకు దగ్గరగా ఉండాలంటే సినిమాలే మార్గం అని ఆయన భావిస్తున్నారట. ఈ నేపథ్యం లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఓ భారీ సినిమా ను నిర్మించడానికి సన్నాహాలు మొదలు పెట్టారని వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ నటించనున్నారని చెబుతున్నారు. ఇక ఈ మూవీ కి మాస్ డైరక్టర్ బోయపాటి దర్శకత్వం వహించనున్నారని చెబుతున్నారు.

ఇదే నిజమైతే పవన్ అభిమానులకు ఇది పెద్ద శుభవార్త అవుతుంది. ఎన్నికల్లో అనూహ్య ఓటమి బాధిస్తున్న వేళ పవర్ స్టార్ సినిమాలో చేస్తే వారికి పండగే అవుతుందనడంలో సందేహం లేదు.

Next Story