పడిపోయిన రూలర్ కలెక్షన్స్

పడిపోయిన రూలర్ కలెక్షన్స్
x
Rular
Highlights

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం రూలర్ .. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా కావడంతో సినిమాపైన...

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం రూలర్ .. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. గత శుక్రవారం (డిసెంబర్ 20)న మూడు సినిమాలకి పోటిగా విడుదలైంది. మొదటిరోజు ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది.

సినిమా విడుదలకి ముందు ఈ చిత్రానికి 24 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్ .. బాలయ్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌తో తొలిరోజు కలెక్షన్స్ బాగానే ఉన్నా రెండో రోజు నుంచి దారుణంగా పడిపోయాయి. ఇక ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం 7.64 కోట్ల షేర్ ను మాత్రమే కొల్లగొట్టింది.ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే అంటే మరో 17 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. చూస్తుంటే కష్టమనే చెప్పాల్సి వస్తుంది. ఈ సినిమాతోపాటు రిలీజైన ప్రతిరోజూ పండగే, దొంగ సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకొని వసూళ్ళ పరంగా దూసుకుపోతున్నాయి. మరి ఇంత పోటిలో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని మొదలుపెట్టాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో పట్టాలేక్కనుంది. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories