బాలకృష్ణ రెమ్యునిరేషన్ 10 కోట్లా ?

బాలకృష్ణ రెమ్యునిరేషన్ 10 కోట్లా ?
x
Highlights

బాలనటుడు నుండి సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ.. ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చాకా వరుసగా సినిమాలు చేస్తున్నారు అయన..ఈ క్రమంలో వంద సినిమాలు పూర్తి చేసారు....

బాలనటుడు నుండి సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ.. ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చాకా వరుసగా సినిమాలు చేస్తున్నారు అయన..ఈ క్రమంలో వంద సినిమాలు పూర్తి చేసారు. అయితేనేం ప్రస్తుతం కుర్ర హీరోలతో కూడా పోటి పడుతున్నాడు.. అటు ఎమ్మెల్యేగా ఇటు సినిమాలతో బిజీబిజీ గా గడుపుతున్నారు బాలకృష్ణ. తాజాగా అయన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు బాలకృష్ణ.

అయితే ఈ సినిమాకి గాను బాలకృష్ణ పది కోట్ల రెమ్యునిరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. దీనికి కూడా చిత్ర నిర్మాత ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా అయన ఇంత రెమ్యునిరేషన్ తీసుకున్నాడని ఎక్కడ కూడా టాక్ లేదు. కానీ ఈ సినిమాకి అయన పది కోట్ల రెమ్యునిరేషన్ తీసుకున్నారని వార్తలు రావడంతో ఇది పెద్ద చర్చనియంశంగా మారింది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించాలని చిత్ర యూనిట్ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories