బాలకృష్ణ, బోయపాటి చిత్రానికి ముహూర్తం ఫిక్స్

బాలకృష్ణ, బోయపాటి చిత్రానికి ముహూర్తం ఫిక్స్
x
Highlights

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.....

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుంది. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాలయ్య సరసన కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం..

ఇన్ని రోజులు స్క్రిప్ట్ వర్క్ తో లేట్ అయిన ఈ సినిమాని వచ్చే నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం.. ఈ సినిమాని జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. రాజకీయ నేపధ్యంలోనే ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఇటివల బాలయ్య కూడా సరికొత్త లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి ఈ సినిమాలో ఇదే లుక్ తో కనిపిస్తారా లేదా అన్నది చూడాలి.

ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా హీరో రాజశేఖర్, శ్రీకాంత్, సునీల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి కానీ దీనిపైన చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేదు. సింహ, లెజెండ్ కాంబినేషన్ నుంచి సినిమా వస్తుండడంతో అభిమానులు ఈ సినిమాపైన అంచనాలు పెట్టుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories