బాలయ్య కొత్త సినిమాకి టైటిల్ రూలర్ కాదట ..కొత్త టైటిల్ ఇదే ..

బాలయ్య కొత్త సినిమాకి టైటిల్ రూలర్ కాదట ..కొత్త టైటిల్ ఇదే ..
x
Highlights

తన తండ్రి బయోపిక్ తో తీసిన కధనాయుకుడు మరియు మహానాయకుడు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు .. దీని తర్వాత ఒక పక్కా కధలు వింటూనే మరో పక్కా...

తన తండ్రి బయోపిక్ తో తీసిన కధనాయుకుడు మరియు మహానాయకుడు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు .. దీని తర్వాత ఒక పక్కా కధలు వింటూనే మరో పక్కా రాజకీయ ప్రచారాలు చేసారు బాలకృష్ణ .. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో సినిమాల పైన ఫోకస్ చేసారు బాలకృష్ణ . ప్రస్తుతం బాలకృష్ణ తమిళ దర్శకుడు కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు .. ఈ మధ్యనే సినిమా మొదలయింది .. అయితే ఈ సినిమాకి ముందు రూలర్ అనే టైటిల్ అనుకున్నారు కానీ ఇప్పుడు అ టైటిల్ కాకుండా మరో టైటిల్ ని డిసైడ్ చేసింది చిత్రబృందం..

కే.ఎస్ రవికుమార్ సినిమా తరవాత వి.వి వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయాల్సి ఉంది కానీ అ సినిమా ప్రస్తుతం ఆగిపోయింది . అ సినిమాకి అనుకున్న క్రాంతి అనే టైటిల్ ని ఇప్పుడు ఈ సినిమాకి వాడుతున్నారు బాలయ్య ..ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు .. ఇందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా మరొకటి గ్యాంగ్ స్టర్ .. ఈ సినిమాకి పరుచూరి మురళి కధని అందిస్తున్నారు . చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ ఇస్తున్నాడు. 2020 సంక్రాంతికి సినిమా విడుద‌ల ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శక నిర్మాత‌లు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories