బాలయ్య కొత్త లుక్ అదిరింది... బోయపాటి సినిమాకేనా!

బాలయ్య కొత్త లుక్ అదిరింది... బోయపాటి సినిమాకేనా!
x
Balakrishna
Highlights

పాత్ర ఏదైనా సరే దానికి న్యాయం చేయడానికి వందకి వంద శాతం కష్టపడుతారు హీరో నందమూరి బాలకృష్ణ..

పాత్ర ఏదైనా సరే దానికి న్యాయం చేయడానికి వందకి వంద శాతం కష్టపడుతారు హీరో నందమూరి బాలకృష్ణ.. తాజాగా అయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన చిత్రాలలో కనిపించనున్నారని తెలుస్తోంది. అందులో ఒకటి 'ఆఘోర' పాత్ర అని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యుల్ కూడా మొదలైంది.

కరోనా వైరస్ ప్రభావంతో చిత్ర యూనిట్ కొన్ని రోజులు షూటింగ్ ని వాయిదా వేసింది. ఇక ఈ నేపధ్యంలో తాజగా ఓ కార్యక్రమంలో బాలయ్య కొత్త లుక్ లో కనిపించారు. ఈ లుక్ లో బాలయ్య చిన్నపాటి జుట్టు, గుబురు మీసంతో కనిపిస్తున్నారు. ఈ లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బోయపాటి సినిమాల్లో ఆయన లుక్‌ ఇదేనంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. గత చిత్రం రూలర్ సినిమాలో కూడా బాలయ్య చాలా బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లకి ప్రాధాన్యత ఉండడంతో మొదటి హీరోయిన్ గా అంజలి ఎంపికైంది. ఇక రెండో హీరోయిన్‌గా పాయల్ రాజ్ పుత్ ని అనుకుంటున్నట్టుగా సమాచారం.. ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా, తమన్‌ సంగీతమందిస్తున్నాడు. ఇక బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories