మరోసారి క్రికెటర్ వార్నర్ అదిరిపోయే స్టెప్పులు.. ఈసారి రాములో..రాములా!

మరోసారి క్రికెటర్ వార్నర్ అదిరిపోయే స్టెప్పులు.. ఈసారి రాములో..రాములా!
x
David warner Dance for Ramulo Ramulo Telugu Song
Highlights

ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ తన టిక్ టాక్ వీడియోలతో ఆదరగోట్టేస్తున్నాడు. మొన్న బుట్ట బొమ్మకి స్తేప్పులేసిన వార్నర్.. ఇప్పుడు రాములో రాములా అంటూ రెచ్చిపోయాడు!

ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ మైదానంలోనే కాదు. టిక్ టాక్ లో కూడా రెచ్చిపోతున్నాడు. టాలీవుడ్ లోని పాటలకు, డైలాగ్స్ పైన టిక్ టాక్ లను చేస్తూ అందరిచేత శభాష్ అనిపిస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆల వైకుంఠపురములో చిత్రంలోని బుట్టబొమ్మ పాటకి తన భార్య క్యాండీస్ తో కలిసి స్టెప్స్ వేసి అందరిని అలరించిన వార్నర్ , ఆ తరవాత మహేష్ బాబు హీరోగా,పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాలోని ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ తో అదరగొట్టాడు.

దీనికి చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఫిదా అయిపోయాడు. నీ దూకుడుకి తగ్గ డైలాగ్ వార్నర్.. నా సినిమాలో నువ్వు గెస్ట్ రోల్ చేయాలి అంటూ కామెంట్ పెట్టాడు. ఇక తాజాగా మరో వీడియోతో ముందుకు వచ్చాడు వార్నర్.. ఈ సారి అల వైకుంఠపురములో చిత్రంలోని రాములో రాములా అనే పాటకి భార్యతో కలిసి స్టెప్స్ వేశాడు వార్నర్.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అయితే వార్నర్ వీడియో పైన హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మరో బిగ్ సప్రైజ్ అంటూ ధన్యవాదాలు తెలిపాడు.

ఇక వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.. దీనితో ఇక్కడ సంస్కృతికి సంప్రదాయాలు వార్నర్ బాగా ఇష్టపడ్డాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో క్రికెట్ మ్యాచ్ లు కూడా రద్దు కావడంతో వార్నర్ ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి టిక్ టాక్ చేస్తూ తన టాలెంట్ ని బయటపెడుతూ మరింత మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంటున్నాడు. ఇక వార్నర్ త్వరలో మరే ఏ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి మరి !



Show Full Article
Print Article
More On
Next Story
More Stories