మెగాస్టార్ ఇంట్లో 1980 బ్యాచ్ సందడి

1980 hero heroines
x
1980 hero heroines
Highlights

1980 దశాబ్దంలో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినీతారలందరూ కలిసి ప్రతి సంవత్సరం ఎక్కడో ఓక చోట

1980 దశాబ్దంలో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినీతారలందరూ కలిసి ప్రతి సంవత్సరం ఎక్కడో ఓక చోట కలిసి గ్రాండ్ గా సందడి చేస్తారన్న విషయం మనకి తెలిసిందే.. ఈ సంవత్సరానికీ గాను మెగాస్టార్ చిరంజీవి ఇల్లు దీనికి వేదికైంది.. ఈ వేడులకి సంబంధించిన ఏర్పాట్లను చిరంజీవి ఇప్పటికే ఏర్పాటు చేశారు. శనివారం, ఆదివారం రెండు రోజులు జరిగే ఈ వేడుకలో తమిళ్, మలయాళం, హిందీ, తెలుగు నటులు అందరు పాల్గొన్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకలో చిరంజీవి, మోహన్‌లాల్‌, రజనీకాంత్‌, వెంకటేశ్‌, భాను చందర్‌, నరేష్‌, భాగ్యరాజ్‌, జాకీ ష్రాఫ్‌, రెహమాన్‌, ప్రభు,సురేష్‌, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, జయసుధ, రాధిక, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, తదితరులు పాల్గొన్నారు. పలు కార్యక్రమాలతో సందడి చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories