Ashwathama: అశ్వథ్థామ ట్రైలర్ వచ్చేసింది!

Ashwathama: అశ్వథ్థామ ట్రైలర్ వచ్చేసింది!
x
Highlights

ఛలో సినిమా తర్వాత హీరో నాగశౌర్యకి సరైనా హిట్ లేదనే చెప్పాలి. తాజాగా నాగశౌర్య నటిస్తున్న చిత్రం 'అశ్వథ్థామ'.. సస్పెన్స్ త్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఛలో సినిమా తర్వాత హీరో నాగశౌర్యకి సరైనా హిట్ లేదనే చెప్పాలి. తాజాగా నాగశౌర్య నటిస్తున్న చిత్రం 'అశ్వథ్థామ'.. సస్పెన్స్ త్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. పైగా ఈ సినిమా కథ కూడా హీరో నాగశౌర్యనే రాయడంతో సినిమాపైన ఆ అంచనాలు మరిన్నిగా పెరిగాయి. ప్రమోషన్ లో భాగంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు చిత్రబృందం.

అయితే చిత్ర ట్రైలర్ ని చూస్తుంటే మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'రాక్షసుడు' సినిమాని పోలినట్టుగా కనిపిస్తుంది. " రాక్షసుణ్ణి, భగవంతున్ని చూసిన ఈ కళ్ళు ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత లేదు అంటూ చిత్ర ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా అమ్మాయిలను ఎవరో కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత చంపేయడం, ఇది పోలీసులు సాల్వ్ చేయాలేకపోవడం ఫైనల్ గా హీరో దిన్ని చేధించడం వంటివి కనిపిస్తాయి.అయితే అశ్వథ్థామ ట్రైలర్ ఎక్కువగా రాక్షసుడు సినిమాని తలపించినప్పటికీ సినిమా కథనంలో ఏమైనా కొత్తగా ఉంటుందా అన్నది చూడాలి.

ఇక ఇప్పటివరకు లవర్ బాయ్ గా కనిపించిన నాగశౌర్య ఈ సినిమాలో మాత్రం ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన మేహరీన్ కథానాయకగా నటిస్తోంది. ఈ సినిమాకి రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని జనవరి 31 న రిలీజ్ చేయనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories