జబర్దస్త్ జగడం.. అప్పారావు బుల్లెట్ భాస్కర్ ల మధ్య కొట్లాట!

జబర్దస్త్ జగడం.. అప్పారావు బుల్లెట్ భాస్కర్ ల మధ్య కొట్లాట!
x
apparao serious on bullet Bhaskar
Highlights

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ షోలో ఇప్పటివరకు స్కిట్ లో భాగంగా చాలానే గొడవలు జరిగాయి... అయితే అవి స్కిట్ లో భాగంగానే నడిచాయి. కానీ తాజాగా బుల్లెట్...

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ షోలో ఇప్పటివరకు స్కిట్ లో భాగంగా చాలానే గొడవలు జరిగాయి... అయితే అవి స్కిట్ లో భాగంగానే నడిచాయి. కానీ తాజాగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో అప్పారావుకి, భాస్కర్ కి మధ్య గొడవ జరిగింది.. ఇందులో బుల్లెట్ భాస్కర్ ని అప్పారావు బండ బూతులు తిట్టాడు.. స్కిట్ లో భాగంగా కొట్టుకుంటూ ఉండాలి. అయితే భాస్కర్ అప్పారావుని అదే పనిగా కొడుతూ వచ్చాడు. దీనితో ఒక్కసారిగా అప్పారావు సీరియస్ అయ్యాడు.

భాస్కర్ పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావా? ఏంట్రా గొడ్డును బాదినట్లు బాదుతున్నా వ్.. అని అని సీరియస్ అవగా, ఆ తర్వాత భాస్కర్ స్పందించి అప్పారావు గారు స్కిట్ లో భాగంగా కొట్టానని చెప్పుకొచ్చాడు. స్కిట్ పేరు చెప్పి ఇలా ఎవరైనా కొడతారా అంటూ తన చొక్కా విప్పి పడిన వాతలను చూపించాడు అప్పారావు.. అంతేకాకుండా నేను టీం లీడర్ అన్న విషయం మర్చిపోకు అని భాస్కర్ ని హెచ్చరించాడు. ఇదంతా జరుగుతున్నంతసేపు యాంకర్ రష్మి, జడ్జిలు మనో, శేఖర్ మాస్టర్ షాకింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి. ఆ తర్వాత స్కిట్ లో భాగంగానే తేలాయి. అలాగే ఇది కూడా అనుకుందాము అనుకుంటే అప్పారావు మాట్లాడిన తీరు చాలా సీరియస్ గా కనిపిస్తుంది. ఏది ఏమైనా దీనిపైన క్లారిటీ రావాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి చూడక తప్పదు. గతంలో కూడా అప్పారావు ఇలాగే ఓసారి షకలక శంకర్ టీంలో ఉన్నపుడు ఇలాగే కొడితే ఇలాగే సీరియస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత అది స్కిట్‌లో భాగమే అని చెప్పుకొచ్చారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories