అమెరికాలో అనుష్క ' సైలెన్స్'

అమెరికాలో అనుష్క  సైలెన్స్
x
Highlights

అనుష్క పేరు చెప్పగానే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమాలో ఆమె ఉందంటే సగం విజయం ఖాయమైనట్టే అంటారు నిర్మాతలు. అరుంధతి మొదలుకుని ఆమె...

అనుష్క పేరు చెప్పగానే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే గుర్తుకు వస్తాయి. సినిమాలో ఆమె ఉందంటే సగం విజయం ఖాయమైనట్టే అంటారు నిర్మాతలు. అరుంధతి మొదలుకుని ఆమె సినిమాలన్నీ ఆమె కారణంగానే ఆదాయాన్ని నమ్ముతారు. భాగమతి తర్వాతా సినిమాల్లో కనిపించని అనుష్క ఇప్పుడు కొత్త సినిమాలో నటిస్తోంది. తన సినిమా సైలెన్స్ కి సైలెన్స్ చెప్పేస్తూ సైలెన్స్ అనే సినిమా చేస్తోందిప్పుడు. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమానే కావడం విశేషం.

హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ రూపొందనుంది. కథా పరంగా ఈ సినిమా షూటింగు అమెరికాలో జరగనుంది. అంతా రెడీగా ఉన్నప్పటికీ అనుష్కకి వీసా రాకపోవడం వలన ఆలస్యమైంది. తాజాగా అనుష్కకి వీసా రావడంతో, త్వరలో అమెరికా వెళ్లేందుకు ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ తో పాటు మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే నటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories