సైరా షూటింగ్ లో అనుష్కకి గాయాలు .. ?

సైరా షూటింగ్ లో అనుష్కకి గాయాలు .. ?
x
Highlights

నటి అనుష్క ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు .. అయితే ఈ షూటింగ్ లో భాగంగా ఆమెకి గాయపడినట్లు తెలుస్తుంది .. ఓ సన్నీవేషాన్ని...

నటి అనుష్క ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు .. అయితే ఈ షూటింగ్ లో భాగంగా ఆమెకి గాయపడినట్లు తెలుస్తుంది .. ఓ సన్నీవేషాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె కాలికి గాయం అయినట్లు తెలుస్తుంది ..గాయం తర్వాత ఆసుపత్రిలో చేరిన అనుష్క ని వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.. అయితే ఈ విషయాన్ని మీడియాకి వెల్లడించేందుకు అనుష్క ఇష్టపడలేదట.. అందువల్లే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .. 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో అనుష్క ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై ఈ సినిమాని రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 02 న గాంధీ జయంతి సందర్బంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories