Top
logo

సైరా కోసం అనుష్కకి భారీ మొత్తం?

సైరా కోసం అనుష్కకి భారీ మొత్తం?
Highlights

అగ్రస్థానం తెచ్చే సౌలభ్యం అంతా ఇంతా కాదు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ బాహుబలితో తెలుగు హీరోయిన్ల లోనే ఎవరికీ లేని...

అగ్రస్థానం తెచ్చే సౌలభ్యం అంతా ఇంతా కాదు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ బాహుబలితో తెలుగు హీరోయిన్ల లోనే ఎవరికీ లేని రేంజ్ సంపాదించుకున్న అనుష్క ఇపుడు ఆ స్థానాన్ని ఎంజాయ్ చేస్తోంది. బాహుబలి కోసం పడ్డ కష్టాన్ని మరిపించేలా ఆమెకు ఆఫర్లు వచ్చినా కొన్ని రోజులు పూర్తిగా గ్యాప్ ఇచ్చింది. ఇపుడు సైలెన్స్ అనే సినిమాలో చేస్తోంది. ఇది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమానే కావడం విశేషం. ఇదిలా ఉంటె మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేస్తున్న సినిమా సైరా! రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో అనుష్కను ఓ ముఖ్య పాత్ర కోసం సంప్రదించారట. పాత్ర నిడివి తక్కువైనా సినిమాలో అతి ముఖ్యమైన పాత్ర కావడంతో ఆ పాత్రని చేయడానికి అనుష్క అంగీకరించింది. అయితే, భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందట అనుష్క. ఆ పాత్రకు ఆమె మాత్రమే కావాలనుకున్న రామ్ చరణ్ కూడా దానికి సరే అన్నాడట. పైగా.. అనుష్క లాంటి పెద్ద హీరోయిన్ తమ సినిమాలో నటించడమే గ్రేట్.. అనుకోసం ఎంత రెమ్మ్యూనరేషన్ ఇచ్చేందుకైనా సిద్దమే అని చెర్రీ అన్నాడట. మొత్తానికైతే ఈ ఇద్దరి మధ్య భారీ అగ్రిమెంటే జరిగిందని తెలుస్తోంది. ఇపుడు ఈ వార్త ఫిలిం వర్గాల్లో సంచలనం గా మారింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర దొరికినా చాలు అని ఎదురుచూసే వారెందరో ఉన్నా.. అనుష్క కోరింది ఇచ్చి సినిమాలోకి తీసుకోవడం పై పెద్ద చర్చే నడుస్తోంది. చిరు కెరీర్ లో 151వ సినిమాగా సైరా నరసింహా రెడ్డి తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాను భారీ హంగులతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. చిరు సరసన నయన తార, తమన్నా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కుచ్చ సుదీప్ లాంటి భారీ తారాగణం సైరా లో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.

Next Story

లైవ్ టీవి


Share it