Top
logo

నాన్నగారి పేరుతో అవార్డులు అందజేయడం సంతోషం : నాగార్జున

నాన్నగారి పేరుతో అవార్డులు అందజేయడం సంతోషం : నాగార్జున
X
Highlights

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ అవార్డుల ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి...

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ అవార్డుల ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా విచ్చేయగా, నాగార్జున హోస్టుగా వ్యవహరించి అలరించారు. 2018, 2019 సంవత్సరాలకు గాను ఏఎన్నార్ నేషనల్ అవార్డులను దివంగత నటి శ్రీదేవి, బాలీవుడ్‌ నటి రేఖలను వరించాయి. శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీ కపూర్ అవార్డును మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదగా అందుకున్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచి యంగ్ హీరోలతో పాటుగా సీనియర్ నటులు తరలిరావడంతో కలర్‌ఫుల్‌గా మారింది. విజయ్ దేవరకొండ, నాగచైతన్య, మంచు లక్ష్మి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

అవార్డ్‌ ఈవెంట్‌లో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, బాలీవుడ్ అందాలరాశి రేఖ ఒకే వేదికపై సాగిన సంభాషణ ఆడియెన్స్‌ను అలరించింది. నటి రేఖ తొలి తెలుగుచిత్రంతో పాటు, అందంపై నాగార్జున చేసిన వ్యాఖ్యలకు అంతే దీటుగా రేఖ కౌంటర్‌ ఇవ్వడంతో సరదా నవ్వుకున్నారు. మీరింత అందంగా ఎలా ఉంటారండీ అని నాగ్ ప్రశ్నించగా అసలు మీరింత అందంగా ఎందుకున్నారో నాకు చెప్పండి. మీరెలా అందంగా ఉన్నారో నేను అలాగే అంటూ రేఖ కౌంటర్ వేశారు. అంతేకాకుండా రేఖ అచ్చమైన తెలుగులో భాషలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు.

అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో అక్కినేని నాగార్జున్‌ తన తండ్రిని తలచుకుని ఎమోషనల్‌ అయ్యారు. తెలుగు సినిమా ఉన్నంతవరకూ అక్కినేని నాగేశ్వరరావు అందరి మనస్సులో ఉంటారని. నాన్నగారి పేరుతో అవార్డులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. నాన్నగారు భౌతికంగా మనమధ్య లేకున్నా ఆయన ఆత్మ మనతోనే ఇక్కడే ఉందని. జాతీయ అవార్డుతో పాటు నాన్నగారు కూడా ఈ వేదికపైనే ఉన్నారని. ఆయన సంకల్పం నెరువుతుందని సంతోషంగా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి అక్కినేనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్ గురించి అనేక సంగతులు వేదికపై పంచుకున్నారు. నాగేశ్వరరావు ఆరోగ్యానికి మానసిక దృఢత్వమే కారణమని స్పష్టం చేశారు. ఏఎన్నార్ నటన అంటే మా ఇంట్లో వాళ్లకు ఎంతో ఇష్టమన్నారు.

శ్రీదేవికి దక్కిన అవార్డు తీసుకునేందుకు వచ్చిన బోనీకపూర్ ఒక్కసారిగా భావోద్వేగాలకు గురయ్యారు. అందరికీ నమస్కారం అంటూ మొదలుపెట్టిన ఆయన శ్రీదేవి స్మృతులను గుర్తుచేసుకుని కన్నీరుపెట్టుకున్నారు. సభకు విచ్చేసిన పెద్దలు అంటూ టి.సుబ్బరామిరెడ్డి, నాగార్జున, చిరంజీవి తదితరులకు ధన్యవాదాలు తెలిపి గద్గద స్వరంతో ఇక తనవల్ల కాదంటూ ప్రసంగం ఆపేశారు.

సుబ్బరామిరెడ్డి పరమేశ్వరి థియేటర్స్ ఆధునికీకరించిన అనంతరం పునఃప్రారంభిస్తూ తనను, అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించారని, ఆ కార్యక్రమానికి తనతోపాటు అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్ ను కూడా పిలిచారని వెల్లడించారు.Web TitleANR National Award Function 2018 -19
Next Story