అన్నిఇబ్బందులో ఉన్న నన్ను నమ్మి సినిమా తీశాడు.. అయనకి జీవితాంతం రుణపడి ఉంటా

అన్నిఇబ్బందులో ఉన్న నన్ను నమ్మి సినిమా తీశాడు.. అయనకి జీవితాంతం రుణపడి ఉంటా
x
Highlights

సినిమా ధియేటర్ కి వచ్చే ప్రేక్షకులకి ఎం కావాలో, ఎలాంటి కామెడీని కావాలని కోరుకుంటారో పక్కగా తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి.

సినిమా ధియేటర్ కి వచ్చే ప్రేక్షకులకి ఎం కావాలో, ఎలాంటి కామెడీని కావాలని కోరుకుంటారో పక్కగా తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి.. పటాస్ సినిమాతో మొదలైన ఈ దర్శకుడి ప్రస్థానం నిజంగానే పటాసు లాగానే పేలుతుంది. సినిమా సినిమాకి హిట్టు కొడుతూ తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. చేసిన అయిదు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయన తాజాగా మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ తన సినీ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అందులో భాగంగా తన తొలి సినిమా అయిన పటాస్ అవకాశం గురించి చెప్పుకొచ్చారు. " కళ్యాణ్ రామ్ ఓ 3D సినిమా తరవాత కథ చెప్పాను. అప్పుడు ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్నారు. అయిదారు నెలల సినిమాలకి దూరంగా ఉండాలని అనుకుంటున్నానని అన్నారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ లో సినిమాని ట్రై చేస్తే అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఇక మళ్ళీ చివరకి కళ్యాణ్ రామ్ దగ్గరికే వెళ్లి కథ వినమని చెప్పాను. అయన ఓ రోజు కథ విని బాగుందని అన్నారు. ఆ తర్వాత బయట బాగా ట్రై చేశాం కాని కుదరలేదు. ఈ టైంలో కళ్యాణ్ రామ్ నన్ను పిలిపించి ఈ సినిమా ఎవరు చేయకున్నా నేను చేస్తానని చెప్పి నన్ను నమ్మి అన్నట్టుగా నన్ను దర్శకుడిని చేశారు. ఆయనని ఎప్పటికి రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు" అనిల్ రావిపూడి 2015లో వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి పదేళ్ళ తర్వాత హిట్ ని ఇచ్చింది.

ఇక సరిలేరు నీకెవ్వరు విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ మొట్టమొదటిసారిగా ఆర్మీ లుక్ లో కనిపించారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రాజేంద్రప్రసాద్, సంగీత, రావు రమేష్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మించారు. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories