హస్బెండ్స్ మీకు అర్ధమౌతోందా .. 'వైఫ్ చేతిలో లైఫ్'

హస్బెండ్స్ మీకు అర్ధమౌతోందా .. వైఫ్ చేతిలో లైఫ్
x
Highlights

సుమ కనకాల ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఇప్పటికి ఎంత మంది యాంకర్స్ వచ్చిన సరే సుమని ఇప్పటికి బీట్ చేయలేకపోతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు సుమ రేంజ్ ఎలా ఉందో.

సుమ కనకాల ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఇప్పటికి ఎంత మంది యాంకర్స్ వచ్చిన సరే సుమని ఇప్పటికి బీట్ చేయలేకపోతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు సుమ రేంజ్ ఎలా ఉందో. బుల్లితెర షోస్ నుంచి సినిమా ఫంక్షన్ల వరకు ఎక్కడ చూసిన సుమనే కనిపిస్తుంది. పుట్టి పెరిగింది అంతా కేరళలో అయినప్పటికీ తెలుగు నేర్చుకొని అచ్చ తెలుగు అమ్మాయిలాగా మారిపోయింది సుమ.. తాజాగా సుమ మరో కొత్త కార్యక్రమంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్వరలో 'వైఫ్ చేతిలో లైఫ్' అనే ఫన్నీ ఎంటర్టైన్మెంట్ షోని మొదలు పెట్టనుంది మా యాజమాన్యం.. స్టార్ మా లో ఈ షో ప్రారంభం అవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. విడుదల చేసిన ప్రోమోలో సుమ.. 'భార్యకేనా ఎప్పుడూ ప్రేమను చూపించే అవకాశం.. ఒక్కఛాన్స్ భర్తకు వస్తేనా.. అంటూ రియల్ లైఫ్ భార్యాభర్తలతో 'అర్ధమౌతోందా?' అంటూ సందడి చేస్తోంది. ఈ ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బులితెర ప్రేక్షకులు కూడా ఈ షో కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories