యాంకర్ రవి కారుకు ప్రమాదం

యాంకర్ రవి కారుకు ప్రమాదం
x
anchor ravi
Highlights

తెలుగు బుల్లితెర యాంకర్ రవి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోయినా రవి కారు మాత్రం చాలా డ్యామేజ్ అయింది. మూసాపేట నుంచి బంజరాహీల్స్...

తెలుగు బుల్లితెర యాంకర్ రవి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోయినా రవి కారు మాత్రం చాలా డ్యామేజ్ అయింది. మూసాపేట నుంచి బంజరాహీల్స్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే దీనిపైన సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రవి, వ్యాన్ డ్రైవర్ , క్లీనర్ ఇద్దరు ఫుల్‌గా తాగి ఉన్నారని, ఈ ప్రమాదం జరిగిన అనంతరం వారిద్దరూ పరారయ్యారని ఫిర్యాదులో తెలిపాడు.

ఇక ఈ యాక్సిడెంట్ పై ఓ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రవి. ఇందులో రోడ్డు ప్రమాదాల గురించి చెప్పుకొచ్చాడు. మనం రోడ్డుపై బాగానే వెళ్ళినప్పటికీ వచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా రావాలని అన్నారు. తన ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించిన సనత్ నగర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories