నమ్మించి మోసం చేశాడు.. 45 లక్షలు కాజేసాడు

నమ్మించి మోసం చేశాడు.. 45 లక్షలు కాజేసాడు
x
anchor ravi ( file photo)
Highlights

తెలుగు బుల్లితెర యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పటాస్ షోలో యాంకర్ శ్రీముఖితో కలిసి యాంకరింగ్ చేసి

తెలుగు బుల్లితెర యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పటాస్ షోలో యాంకర్ శ్రీముఖితో కలిసి యాంకరింగ్ చేసి ఆ షో సక్సెస్ కి కారణం అయ్యాడు. ప్రస్తుతం ఆ షోలో అయితే చేయడం లేదు. అప్పట్లో శ్రీముఖి లేనందుకే రవి పటాస్ కి బై బై చెప్పాడని వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ తప్పుడు వార్తలని, అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు రవి .

అయితే తాజాగా ఓ ప్రైవేట్ యు ట్యూబ్ ఛానల్ కి రవి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు రవి. అప్పట్లో తనతో రెండేళ్లు కలిసున్న ఓ స్నేహితుడు నమ్మించి మోసం చేసాడని, 45 లక్షలు కాజేసాడని చెప్పుకొచ్చాడు. 20 రోజుల్లో ఇస్తానని చెబితే నోటి మాట మీదా ఎలాంటి పత్రం లేకుండా 45 లక్షల రూపాయలు ఇచ్చానని, కానీ రెండేళ్లైనా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనిపైన లీగల్ పోరాటం చేస్తున్నాని , ఎం జరుగుతుందో తెలియదని చెప్పుకొచ్చాడు. కానీ అతను ఎవరు అన్నది మాత్రం బయటపెట్టలేదు రవి. ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలా విషయాలనే చెప్పుకొచ్చాడు రవి.

ఇక ఇన్ని రోజులు యాంకరింగ్ చేసి పెద్దగా సంపాదించింది ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్లుగా సంపాదించింది తన కుటుంబానికి ఖర్చు చేసానని, వెనకేసింది కూడా తక్కువే అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే నిర్మాతగా ఓ షో ప్లాన్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలపై ఖండిచాడు రవి. నిర్మాతగా చేసే కోట్ల రూపాయలు డబ్బు తన దగ్గర లేవని.. కేవలం తన ఖర్చులు మాత్రమే చూసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవి జీ తెలుగులో వస్తున్న లోకల్ గ్యాంగ్స్ అనే షోని చేస్తున్నాడు షో చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories