రూ.41 లక్షల మోసం..సందీప్ పై క్రిమినల్ కేసు పెట్టిన యాంకర్ రవి

రూ.41 లక్షల మోసం..సందీప్ పై క్రిమినల్ కేసు పెట్టిన యాంకర్ రవి
x
Highlights

సందీప్ అనే డిస్ట్రిబ్యూటర్ తన దగ్గర రూ.41 లక్షలు తీసుకుని, కొంత డబ్బులు ఇచ్చాడని, మిగతా డబ్బులు ఇవ్వాలని, కానీ ఇవ్వకుండా మోసం చేశాడంటూ కూకట్ పల్లి...

సందీప్ అనే డిస్ట్రిబ్యూటర్ తన దగ్గర రూ.41 లక్షలు తీసుకుని, కొంత డబ్బులు ఇచ్చాడని, మిగతా డబ్బులు ఇవ్వాలని, కానీ ఇవ్వకుండా మోసం చేశాడంటూ కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు యాంకర్ రవి. యాంకర్ రవి హీరోగా 'ఇది మా ప్రేమ కథ' అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి గాను సందీప్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. కాకపోతే ఆ సినిమా ప్లాప్ అయింది. అయితే, అప్పట్లో గుడ్ విల్ కింద డబ్బులు ఇచ్చిన యాంకర్ రవి మళ్లీ ఆ డబ్బులు తిరిగివ్వాలని గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి బెదిరిస్తున్నాడంటూ 2018 అక్టోబర్‌లో యాంకర్ రవి పై స్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు సందీప్ . ఇక తన దగ్గర తీసుకున్నట్లే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న సందీప్ వారిని కూడా ఇలాగే మోసం చేశాడని నిన్న సాయంత్రం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు రవి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories