నాకేం కాలేదు.. కంగారు పడొద్దు : యాంకర్ ప్రదీప్

నాకేం కాలేదు.. కంగారు పడొద్దు : యాంకర్ ప్రదీప్
x
Highlights

యాంకర్ ప్రదీప్ గత కొద్దిరోజులు నుండి టీవీ షోలో కనిపించడం లేదు. దీనితో ప్రదీప్ కి ఎదో అయింది అన్న వార్తలు వచ్చాయి. అతని ఆరోగ్య పరిస్థితి బాలేకే...

యాంకర్ ప్రదీప్ గత కొద్దిరోజులు నుండి టీవీ షోలో కనిపించడం లేదు. దీనితో ప్రదీప్ కి ఎదో అయింది అన్న వార్తలు వచ్చాయి. అతని ఆరోగ్య పరిస్థితి బాలేకే ప్రదీప్ మునుపటిలాగా షోలు చేయడం లేదు అని గుసగుసలు వినిపించాయి. అయితే తనపైన వస్తున్న వార్తలపై స్పందించాడు ప్రదీప్..

గురువారం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా లైవ్ లోకి వచ్చిన ప్రదీప్ అభిమానులతో ముచ్చటించాడు. సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా తనకి ఏదోదో అయిందని వస్తున్న వార్తలు అబద్దమని, నాకు ఓ షో షూటింగ్ చేస్తున్న సమయంలో కాలికి దెబ్బ తగిలిందని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. అయిన షోలు చేయడంతో ఇప్పుడు అది పెద్దది కావడంతో వైద్యులు నెలరోజులు నిలుచోవద్దని చెప్పారట. వైద్యుల సలహాల మేరకు తానూ పూర్తిగా రెస్ట్ తీసుకొని కోలుకున్నానని చెప్పుకొచ్చాడు . నా గురించి ఎవరు కంగారు పడవద్దు అని చెప్పుకొచ్చాడు.

ఇక త్వరలోనే మళ్ళీ యధావిధిగా షోలు చేస్తానని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. తనపై వచ్చిన నెగిటివ్ వార్తలపై కూడా స్పందిచాడు ప్రదీప్.. ఇక తన పుట్టినరోజుకి గాను విషెస్ చెప్పిన ప్రతిఒక్కరికి థాంక్స్ చెప్పాడు ప్రదీప్.. ప్రస్తుతం ప్రదీప్ కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా, ఎక్స్‌ప్రెస్‌ రాజా, ఢీ జోడి లాంటి షోలకి వాఖ్యతగా వ్యవహరిస్తూన్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories