Happy Birthday Anasuya: టీవీ యాంకర్ నుంచి రంగమ్మత్త వరకు..

Happy Birthday Anasuya: టీవీ యాంకర్ నుంచి రంగమ్మత్త వరకు..
x
Anchor anasuya bharadwaj(File photo)
Highlights

అందం,అభినయంతో ఆకట్టుకోగల నటి అనసూయ.. టీవీ యాంకర్ గా తన కెరియర్ ని మొదలు పెట్టిన అనసూయ ఆ తరవాత యాంకర్ గా మారి చిన్నచిన్న షోలతో తన టాలెంట్ ని బయటపెట్టింది.

అందం,అభినయంతో ఆకట్టుకోగల నటి అనసూయ.. టీవీ యాంకర్ గా తన కెరియర్ ని మొదలు పెట్టిన అనసూయ ఆ తరవాత యాంకర్ గా మారి చిన్నచిన్న షోలతో తన టాలెంట్ ని బయటపెట్టింది.ఇక జబర్దస్త్ షో లో యాంకర్ గా ఛాన్స్ కొట్టేసి చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. యాంకర్ గానే కొనసాగుతూనే సినిమాల్లో మంచి పాత్రలు దక్కినప్పుడు తనలో కూడా మంచి నటి ఉందని నిరూపించింది. ఈ రోజు(మే15)న పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అనసూయ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాగ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది అనసూయ.. ఇక చాలా గ్యాప్ తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో నటించింది. ఈ సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఆ తర్వాత క్షణం, రంగస్థలం, యాత్ర,గాయత్రి మొదలగు సినిమాల్లో నటించింది. అయితే ఇందులో రంగస్థలం సినిమాలోని రంగమత్త పాత్రకి అనసూయకు మంచి పేరును తీసుకువచ్చింది. అయినప్పటికీ వరుసపెట్టి సినిమాలు చేయకుండా మంచి పాత్రల కోసం ఎదురుచూస్తోంది..

ఇటు జబర్దస్త్, అటు సినిమాలతో బిజీ గా ఉంటూనే తన ఫ్యామిలీ కూడా టైం కేటాయిస్తూ సరదాగా గడుపుతుంది అనసూయ.. సుశాంక్ భరద్వాజ్‌ని ప్రేమించి పెళ్లాడిన అనసూయ,గృహిణిగా, తల్లిగా మెప్పు పొందుతోంది. ఇక అనసూయలో ఉన్న మరో కోణం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం.. ఇలా చేయడం వలన కొన్ని సార్లు విమర్శలు పాలు అయినపప్పటికి అదే తనలో గొప్ప వ్యక్తిత్వంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అనసూయకి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇకపోతే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ తనకు హీరో అర్జున్ అంటే ఫస్ట్ క్రష్ అని ఓపెన్‌గా చెప్పేసి ఆశ్చర్యపర్చింది అనసూయ. ఆయన నటించిన జెంటిల్‌మెన్ సినిమా చూసి ఫిదా అయ్యానని పేర్కొంది..ఓ టీవీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి తన జర్నీలో ఎన్నో మలుపులు చూసిన అనసూయ ఇలా మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హెచ్ఎంటీవీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories