Top
logo

జబర్దస్త్ షోకి అనసూయ గుడ్ బై ..?

జబర్దస్త్ షోకి అనసూయ గుడ్ బై ..?
Highlights

బుల్లితెరపై యాంకర్ గా అనసూయ బాగా సక్సెస్ అయింది .. ఇక ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా ఆమెకి మంచి...

బుల్లితెరపై యాంకర్ గా అనసూయ బాగా సక్సెస్ అయింది .. ఇక ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా ఆమెకి మంచి పేరు వచ్చింది . ఎంతలంటే జబర్దస్త్ అంటే అనసూయ .. అనసూయ అంటే జబర్దస్త్ అనే రేంజ్ కి మార్చేసింది .. బుల్లితెరపై యాంకర్ గా మాత్రమే కాకుండా వెండితెరపై కొన్ని సినిమాల్లో మెరిసింది అనసూయ .. క్షణం మరియు రంగస్థలం సినిమాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి .. అంతేకాకుండా సినిమా ఆఫర్ లను తెచ్చిపెట్టాయి .. కానీ పాత్రలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఆమె ముందునుండి ఎంచుకుంటూ వస్తుంది ..

అయితే తాజాగా ఆమెకి చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ ముఖ్యపాత్ర దక్కిందని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది .. అంతే కాకుండా నాగార్జున మరియు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో కూడా అనసూయది కూడా ముఖ్యపాత్రే నట దీనితో ఇటు సినిమాలకు అటు జబర్దస్త్ షో కి డేట్లు అడ్జస్ట్ చేయడం కుదరకపోవడంతో కొన్ని రోజులు జబర్దస్త్ షోని పక్కన పెట్టాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి .. మరి అనసూయ లేని జబర్దస్త్ ని జనాలు ఎలా చూస్తారో చూడాలి మరి ..

Next Story

లైవ్ టీవి


Share it