అర్జీవికి మెగాస్టార్ నుంచి బెస్ట్ విషెస్

RGV
x
RGV
Highlights

ఇక వర్మ చేస్తున్న మరో చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రేపు విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు సినిమాని చూడకపోవడం,

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి బెస్ట్ విషెస్ చెప్పారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మార్షల్ ఆర్ట్స్ చిత్రం ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ చిత్ర ట్రైలర్ ని వర్మ ఈ రోజు విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో పూజ భాలేకర్ మెయిన్ రోల్ లో నటిస్తుంది. అయితే ఈ చిత్ర టిజర్ ని చూసిన మెగాస్టార్ అమితాబ్ వర్మకి బెస్ట్ విషెస్ ని అందజేశారు.

వర్మకి అమితాబ్ కి ముందునుండి మంచి సానిహిత్యం ఉంది. 2005లో వీరి కాంబినేషన్ లో సర్కార్ అనే సినిమా వచ్చి మంచి హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత సర్కార్ రాజ్, సర్కార్ 3, నిశ్శబ్ద్, ఆగ్, డిపార్ట్మెంట్ లాంటి సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి.

ఇక వర్మ చేస్తున్న మరో చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రేపు విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు సినిమాని చూడకపోవడం, సినిమాపై సర్టిఫికట్ ఇవ్వకపోవడంతో కోర్టులో పిటిషన్ వేశారు వర్మ.. దీనిపైన కోర్టు స్పందిస్తూ సినిమాని మరో వారం రోజులలో చూడాలని తీర్పుని ఇచ్చింది. దీనితో ఈ చిత్రం వాయిదా పడింది, వర్మ ఈ సినిమా తర్వాత జార్జిరెడ్డి ఫేం సందీప్ మాధవ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్నీ ఇప్పటికే వర్మ ప్రకటించాడు కూడా.. హైదరాబాద్ దాదాల నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఈ సినిమాకి శివ సినిమా స్ఫూర్తి అని వర్మ పేర్కొన్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories