రాష్ట్రపతి చేతుల మీదుగా అమితాబ్‌కు దాదా సాహేబ్ పాల్కే అవార్డ్

రాష్ట్రపతి చేతుల మీదుగా అమితాబ్‌కు దాదా సాహేబ్ పాల్కే అవార్డ్
x
amitabh bachchan
Highlights

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్ రాష్ట్రపతి చేతుల మీదుగా దాదా సాహేబ్ పాల్కే అవార్డ్ ని అందుకున్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్ భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా దాదా సాహేబ్ పాల్కే అవార్డ్ ని అందుకున్నారు. నిజానికి అయన ఈ అవార్డును అయన కొన్ని రోజుల క్రితమే అందుకోవాల్సింది కానీ అయన ఆరోగ్య పరిస్థితుల నేపధ్యంలో అందుకోలేకపోయారు. ఈ అవార్డును హిందీ చిత్ర సీమ నుండి అందుకుంటున్న 32 వ్యక్తిగా అమితాబ్ రికార్డు సృష్టించాడు.

చాలా సినిమాల్లో విభిన్నమైన పాత్రలో నటించి అంచలంచలుగా ఎదిగారు అమితాబ్ .. తన సినీ కెరియర్ లో మొత్తం 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుపొందారు. ఇక హీరోగా 1970, 80లలో అమితాబ్ వరుస హిట్లతో దూసుకుపోయారు.అమితాబ్ కి 1984లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో, 2001లో పద్మభూషన్ తో 2015లో పద్మవిభూషన్ తోనూ గౌరవించింది. ఇప్పుడు తాజాగా దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ని కూడా ఇచ్చి గౌరవించింది. అయన ఈ అవార్డును సొంతం చేసుకోవడం పట్ల అయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు.

భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శతజయంతి సందర్భంగా 1969 లో దాదాసాహెబ్ ఫాల్కె పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతీయ చిత్ర వికాసంలో ఎనలేని కృషి చేసి, అద్భుత ప్రతిభా పాటవాలను కనబరిచే అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే లభించే గౌరవం ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.

నటీనటులు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, నేపథ గాయకులు, పాటల రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఒకరని కాదు చలన చిత్రాభివృద్ధికై విశిష్టంగా కృషి చేసిన ఎవరైనా ఈ అవార్డుకు అర్హులే. కానీ అంతటి విశిష్ట సేవ చేసిన వారు చాలా అరుదుగానే ఉంటారు. అందుకే చాలా అరుదైన వ్యక్తులు మాత్రమే పొందే బిరుదు ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..మొట్టమొదటి సారిగా 1969 లో ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి దేవికా రాణికి అందచేశారు. ఆ తర్వాత కాలంలో పృధ్వీ రాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.యన్ సర్కార్ లాంటి వాళ్ళకు ఈ అవార్డ్ అందచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories