Ala Vaikunthapurramuloo : నాకు అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది.

Ala Vaikunthapurramuloo : నాకు అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది.
x
Highlights

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'.

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఈ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు.

ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "గీతా ఆర్ట్స్ లో ప్రొడక్షన్ కంపెనీయే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. ఎప్పుడైనా ఆఫీసు వైపు వెళ్ళినప్పుడు 'ఏవండీ ఎప్పుడూ సెలబ్రేషన్ మీరేనా చేసుకునేది, మమ్మల్ని జనం దగ్గరికి తీసుకెళ్ళరా, మమ్మల్ని పట్టించుకోరా, మాకు షీల్డ్స్ ఇచ్చి సత్కరించరా?' అని అడిగేవాళ్లు. 'అంత సినిమా వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తాను' అని చెప్పేవాడిని. నిజంగా అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది. మాకు ఆ అవకాశం ఇచ్చింది ప్రేక్షకులు. మా టీం కలిసి చేసింది 50 శాతం అయితే ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకువచ్చింది 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లందరికీ చాలా కృతజ్ఞతలు.

నాతో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరి తరఫున ప్రేక్షకులకు థాంక్స్ చెబ్తున్నా. నిర్మాతలు రాధాకృష్ణ గారికి, అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు. మా నాన్నను ఎలా సంబోధించాలా అని ఒక్కోసారి నాకు కన్ఫ్యూజన్ వస్తుంటుంది. మా నాన్న నన్ను పరిచయం చేస్తూ 'గంగోత్రి', తర్వాత 'బన్నీ', ఇంకా ఎన్నో హిట్లిచ్చారు. రాధాకృష్ణ గారితో మొదటిసారి 'జులాయి' చేశాను. అది సక్సెస్ ఫుల్ ఫిలిం. తర్వాత 'సన్నాఫ్ సత్యమూర్తి' చేశాను. వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ ప్రొడ్యూసర్లు. ఇద్దరితో సూపర్ హిట్స్ కొట్టాను కానీ ఇద్దరూ కలిస్తే ఆల్ టైం రికార్డ్ హిట్ వచ్చింది. ఇద్దరికీ చాలా థ్యాంక్స్. నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది..

బన్నివాసు, వక్కంతం వంశీకి ఎప్పటి నుంచో నేను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్నా కానీ ఆయనతో చేస్తే బాగుంటుంది అని నాకు బూస్ట్ ఇచ్చి త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చింది వాళ్ళిద్దరు. వాళ్లకి థాంక్స్. అలాగే నేను ఎక్కువగా గడిపే నా పర్సనల్ స్టాఫ్ కు థాంక్స్. ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో సెలబ్రేషన్స్ చేసుకోవడం మా బాధ్యత. ఇక రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను.

ఇంకో విషయం.. 'సిత్తరాల సిరపడు' సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతాను. అది సినిమాలో ఆ క్యారెక్టర్ ని బట్టి చేసింది. నిజజీవితంలో అది మంచిది కాదు. పిల్లలు స్మోక్ చేయవద్దు. పిల్లలే కాదు పెద్దలు కూడా స్మోక్ చెయ్యొద్దని కోరుకుంటున్నాను. అది ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి. మరోసారి నా అభిమానులకు, నా ఆర్మీకి థాంక్స్ చెప్పుకుంటున్నాను. కేవలం మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్" అని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories