Allu Arjun రిక్వెస్ట్ .. దయచేసి నన్ను ఫాలో అవ్వొద్దు

Allu Arjun రిక్వెస్ట్ .. దయచేసి నన్ను ఫాలో అవ్వొద్దు
x
Highlights

తన అభిమానులకి నన్ను ఫాలో అవొద్దు అని చెబుతున్నాడు హీరో అల్లు అర్జున్.. అదేంటి అభిమాన హీరోని ఫాలో కావద్దు అని అంటున్నాడు అని అనుకుంటున్నారా? అవును...

తన అభిమానులకి నన్ను ఫాలో అవొద్దు అని చెబుతున్నాడు హీరో అల్లు అర్జున్.. అదేంటి అభిమాన హీరోని ఫాలో కావద్దు అని అంటున్నాడు అని అనుకుంటున్నారా? అవును బన్ని చెప్పేది నిజమే మరి .. ! ఇక వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలిజైంది. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా హ్యట్రిక్ గా నిలిచింది.

ఈ సినిమా హిట్ కావడానికి పాటలు కూడా మెయిన్ రీజన్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా చివరలో ఫైట్ సీక్వెన్స్ లో వచ్చే సిత్తరాల సిరపడు పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో బన్ని స్టైల్ ఆ బీడీ తాగుతూ, ఓ చేతిలో పందెం కోడిని పట్టుకొని వస్తూ విలన్స్ ని చితకబాదుతాడు. ఇది బన్ని అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకి కూడా బాగా నచ్చింది. దీనితో బన్నినే ఇమిటేట్ చేస్తూ. బీడీ తాగుతూ టిక్ టాక్ లో చేస్తున్నారు. అయితే ఈ విషయం కాస్తా బన్ని ద్రుష్టికి వెళ్ళింది. దీనితో బన్ని దిని గురించి మాట్లాడుతూ .. " పొగ తాగడం ఆరోగ్యాన్ని చెడగొడుతుందని చెప్పాడు. తాము కేవలం సినిమాలో ఆ సన్నివేశం కోసం మాత్రమే అలా పొగ తాగాల్సి వచ్చింది కానీ నిజ జీవితంలో తాను సిగరెట్లకు చాలా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. మరి అయన ఫ్యాన్స్ ఎం మాత్రం వింటారో చూడాలి మరి!

ప్రస్తుతం బన్ని సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఆర్య, ఆర్య 2 సినిమాల ద్వారా వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపద్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories