అక్కడ ప్రభాస్ రికార్డును బ్రేక్ చేసిన అల్లు అర్జున్

అక్కడ ప్రభాస్ రికార్డును బ్రేక్ చేసిన అల్లు అర్జున్
x
allu arjun, prabhas
Highlights

తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి అని చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం అక్కరలేదు.

తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి అని చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం అక్కరలేదు. ఎందుకంటే ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఎప్పటినుండో అనుకుంటున్న సైరా లాంటి డ్రీం ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా 1500 కోట్లను కొల్లగొట్టింది.

అయితే ఈ సినిమా రికార్డును ఈ సంక్రాంతికి వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం బీట్ చేసింది. కంగారు పడకండి. బీట్ చేసింది ఇక్కడ కాదు న్యూజిల్యాండ్‌లో.. శుక్రవారం రాత్రి అమెరికా, న్యూజిల్యాండ్‌లో 'అల వైకుంఠపురములో ' ప్రీమియర్ షోలు వేశారు. న్యూజిల్యాండ్‌లో ప్రీమియర్ షోలలో 34,625 డాలర్ల వసూళ్లు రాబట్టాయి. ఇక ప్రభాస్ బాహుబలి ప్రీమియర్‌ షోలు న్యూజిల్యాండ్‌లో 21,290 డాలర్లు మాత్రమే రాబట్టాయి. ఈ లెక్కలు చూస్తుంటే బాహుబలి రికార్డును అల వైకుంఠపురములో బ్రేక్ చేసిందని చెప్పాలి.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ నుంచి సినిమా రావడం, తమన్ అందించిన పాటలకి ఎక్కడ లేని క్రేజ్ రావడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా బాగుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ సినిమా.. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 45 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు మార్కెట్ అనలిస్ట్‌లు లెక్కలు కట్టారు. అధికారిక లెక్కలు రావాల్సి ఉండగా.. షేర్ రూ. 30 కోట్లు రాబట్టిందని అంచనా వేస్తున్నారు.

పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. టబు, జయరాం, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, మురళీ శర్మ, సునీల్, సచిన్ ఖెడేకర్, హర్షవర్ధన్ ముఖ్యపాత్రలు పోషించారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించాయి. పి యస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories