150 మిలియన్ల వ్యూస్ అందుకున్న బన్నీ 'బుట్టబొమ్మ'.. పాట

150 మిలియన్ల వ్యూస్ అందుకున్న బన్నీ బుట్టబొమ్మ.. పాట
x
Pooja Hegde, Allu Arjun (File Photo)
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లోని పాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయనే చెప్పాలి.

ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ,రాములో రాములా వంటి సాంగ్స్ పెద్ద హిట్టైయ్యాయి. ఇక అందులో బుట్ట బొమ్మ పాటకు అల్లు అర్జున్ వేసిన స్టైలిష్ స్టెప్పులు అదరగొట్టాయి. థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులు కూడా వేయించాయి. ఇప్పటికే ఈ పాట చాలా రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సాంగ్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. యూట్యూబ్‌లో ఈ పాట 150 మిలియన్ వ్యూస్ మార్కును దాటేసింది. ఈ మార్కును వేగంగా అందుకున్న పాట ఇదే కావడం విశేషం.. 2 నెలల కాలంలోనే 150 మిలియన్ వ్యూస్‌ను ఈ పాట సాధించింది. ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించారు.

అల్లు అర్జున్ సినిమాలోని ఒక వీడియో సాంగ్ 150 మిలియన్ వ్యూస్ సాధించడం ఇది రెండోసారి.. అంతకు ముందు దువ్వాడ జగన్నాధం సినిమాలో సిటిమార్ పాట 150 మిలియన్ వ్యూస్ అందుకుంది. కానీ దానికి చాలా సమయం పట్టింది. ఇక ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కం ఫస్ట్ లుక్ ని ఇప్పటికే విడుదల చేసింది చిత్రబృందం.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్య, అర్య2, సినిమాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories