'అల వైకుంఠపురములో..' మరో రికార్డు!

అల వైకుంఠపురములో.. మరో రికార్డు!
x
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లోని పాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయనే చెప్పాలి.

ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ,రాములో రాములా వంటి సాంగ్స్ పెద్ద హిట్టైయ్యాయి. థియేటర్లలో ప్రేక్షకుల చేత స్టెప్పులు కూడా వేయించాయి. ఈ పాటలు చాలా రికార్డులను కొల్లగొట్టాయి. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌కి యూట్యూబ్‌లో మొత్తం బిలియన్ (వంద కోట్లు) వ్యూస్ వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా ఆల్బమ్‌కి ఈ స్థాయిలో ఆదరణ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం..ఇక మా ఆల్బమ్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు` అంటూ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైనా గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది.

ఇక ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కం ఫస్ట్ లుక్ ని ఇప్పటికే విడుదల చేసింది చిత్రబృందం.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్య, అర్య2, సినిమాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories