అల్లు అర్జున్ `పుష్ప`.. అదిరిన ఫ‌స్ట్ లుక్..

అల్లు అర్జున్ `పుష్ప`.. అదిరిన ఫ‌స్ట్ లుక్..
x
Highlights

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బుధవారం...

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బుధవారం అల్లు అర్జున్‌ జన్మదినోత్సవం సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ రివీల్ చేసింది మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ఈ సినిమాకు `పుష్ప` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో పూర్తి గడ్డంతో, రఫ్ లుక్‌తో బన్నీ సరికొత్తగా ఉన్నాడు. చిత్తూరు జిల్లాలోని స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను కూడా `రంగస్థలం` తరహాలోనే పీరియాడిక్ డ్రామాగా సుకుమార్ తెరకెక్కించబోతున్నారు.

'ఇది నా తర్వాత చిత్రం ఫస్ట్‌లుక్‌. టైటిల్‌ 'పుష్ప'. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దీని గురించి చాలా ఉత్సుకతతో ఉన్నా. ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా' అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories