సరికొత్త వ్యాపారంలోకి అల్లు అరవింద్...ఆ ఇద్దరు బిజినెస్‌మెన్లతో?

సరికొత్త వ్యాపారంలోకి అల్లు అరవింద్...ఆ ఇద్దరు బిజినెస్‌మెన్లతో?
x
Highlights

ప్రముఖ తెలుగు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఓటీటీ బిజినెస్ ప్రారంభం కాబోతోంది. ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ అని...

ప్రముఖ తెలుగు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఓటీటీ బిజినెస్ ప్రారంభం కాబోతోంది. ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ అని అర్థం. దీనివల్ల కేబుల్, డిష్ లాంటివి ఏవీ లేకుండానే ఇంటర్నెట్ ద్వారా టీవీ చానల్స్ ను ఆన్లైన్ లో చూసే సదుపాయం లభిస్తుంది. ఇది దాదాపు అన్ని విదేశాల్లో కొనసాగుతున్న పద్ధతి కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు ఈ బిజినెస్ లో మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు కూడా పెట్టుబడిని పెట్టారు.

ఈ బిజినెస్ కోసం రామేశ్వరరావు 70 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ బిజినెస్ లో చేరినట్లు సమాచారం అందుతోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై న రాబోతున్న ఒరిజినల్ కంటెంట్ కూడా ఇందులో ప్రసారం కాబోతోంది. ఇక రానున్న ఐదు సంవత్సరాల్లో డిష్ మరియు కేబుల్స్ పోయి ప్రజలు మాత్రమే ఎక్కువ శాతం ఓటీటీ ని వాడతారని విశ్లేషిస్తున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ గతంలో మా టీవీని ఎంత పెద్దగా విస్తరించాడో తెల్సిందే. అందుకే ఆయనపై నమ్మకంతోనే అల్లు అరవింద్ మరియు రామేశ్వరరావు పెట్టుబడులు పెడుతున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ బిజినెస్ కు సంబంధించిన అధికారిక ప్రటకన రాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories