మరో సాహసం చేయబోతున్న అల్లరి నరేష్..

మరో సాహసం చేయబోతున్న అల్లరి నరేష్..
x
Highlights

అల్లరి నరేష్ తో సినిమా అంటే దర్శక నిర్మాతలకి మినిమం గ్యారెంటీ అనే ఓ లెక్క ఉండేది. కానీ వరుస సినిమాలు ఫ్లాప్ అవడంతో సినిమాలు తగ్గించాడు నరేష్ ..ఆ...

అల్లరి నరేష్ తో సినిమా అంటే దర్శక నిర్మాతలకి మినిమం గ్యారెంటీ అనే ఓ లెక్క ఉండేది. కానీ వరుస సినిమాలు ఫ్లాప్ అవడంతో సినిమాలు తగ్గించాడు నరేష్ ..ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్సకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకు గాను నరేష్ కి మంచి పేరు వచ్చింది. సినిమా సక్సెస్ మీట్ లో నరేష్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు అయింది సక్సెస్ అనే మాట విని అంటూ భాగోద్వేగానికి లోను అయ్యాడు . ఇక తరవాత చేయబోయే సినిమాలు కథలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు నరేష్ .

అందులో భాగంగానే ఇప్పుడు కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నరేష్ . దర్శకుడు హరీష్ శంకర్ దగ్గర పని చేసిన విజయ్‌ కనకమేడల దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు నరేష్.. ఈ సినిమాతో దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాతగా మారుతున్నాడు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. పూర్తి స్థాయి హాస్య ప్రధానంగా ఈ కథ తెరకేక్కుతున్నట్లు సమాచారం . త్వరలో సినిమా గురించి అధికార ప్రకటన వేలువడే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories