RRRకి గుడ్ బై చెప్పేసిన అలియా భట్

RRRకి గుడ్ బై చెప్పేసిన అలియా భట్
x
Alia bhat File photo
Highlights

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కుకేక్కుతున్న చిత్రం RRR( వర్కింగ్ టైటిల్ మాత్రమే)... పీరియాడిక్‌ డ్రామాగాఈ సినిమా తెరకెక్కుతుంది.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కుకేక్కుతున్న చిత్రం RRR ( వర్కింగ్ టైటిల్ మాత్రమే)... పీరియాడిక్‌ డ్రామాగాఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. వచ్చే ఏడాది జులై 30 న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుంది. ఇందులో అలియా సీత అనే పాత్రలో కనిపించనుంది. ఓ సౌత్ సినిమాలో అలియా తొలిసారిగా నటిస్తుండటం విశేషం. ఆమెకి సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవడంతో ఆమెను సెట్ నుండి పంపించేశాడు రాజమౌళి.. అలియా పాత్ర తెర మీద కొద్దిసేపే మాత్రమే కనిపించనుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్‌ నటిస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది. ఆమెతో పాటు మరో ఇద్దరు హాలీవుడ్ భామలు ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే 70 శాతం కంప్లీట్ చేసుకున్న షూటింగ్ మరో 40 రోజుల్లో మొత్తం పూర్తి అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం జక్కన్న క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రికరిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories