సాయంకాలాన 'అల' సాగర తీరాన

సాయంకాలాన అల సాగర తీరాన
x
Highlights

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఇక ఓవర్‌సీస్‌లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.

సినిమా మంచి విజయం సాధించడంతో విజయోత్సవ వేడుకలను చిత్ర భారీ గానే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రేక్షకుల సమక్షంలో సినిమా విజయోత్సవ వేడుకలను నిర్వహించాలని ప్లాన్ చేశారు. జనవరి 19 న వైజాగ్ లో చాలా గ్రాండ్ గా సక్సెస్ సెల్రబ్రేషన్స్ జరపబోతున్నారు. ఈ సెల్రబ్రేషన్స్ లో చిత్ర యూనిట్ అంత పాల్గొంటుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ , హరిక హాసిని క్రియేషన్స్ కలిసి నిర్మించాయి. తమన్ సంగీతం అందించాడు. సుశాంత్, నివేతా పెతురాజ్ , టబు, సునీల్ , మురళీశర్మ తదితరులు నటించారు.

ఇక ఇదే సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా విజయోత్సవ వేడుకలను ఈరోజు (జనవరి 17న) వరంగల్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ పాల్గొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories