Ala Vaikunthapurramloo 50 డేస్ కలెక్షన్స్

Ala Vaikunthapurramloo 50 డేస్ కలెక్షన్స్
x
Ala Vaikunthapurramloo (File Photo)
Highlights

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో' .. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలకి ముందు తమన్ పాటలు , త్రివిక్రమ్ టేకింగ్ , అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , పూజా అందాలు ఇలా వేటికవే హైలెట్ గా నిలుస్తూ సినిమాని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. అయితే ఈ సినిమా నేటికి యాభై రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం యాబై రోజుల్లో ఈ చిత్రం 131.02 కోట్ల షేర్ ని కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రాంతాల వారిగా కలెక్షన్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి.

నైజాం: 44.87 కోట్లు

♦ సీడెడ్ : 18.50 కోట్లు

♦ ఉత్తరాంద్ర: 19.84 కోట్లు

♦ vఈస్ట్ గోదావరి : 11.44 కోట్లు

♦ వెస్ట్ గోదావరి : 8.93 కోట్లు

♦ గుంటూరు : 11.14 కోట్లు

♦ కృష్ణ : 10.84 కోట్లు

♦ నెల్లూరు : 4.71 కోట్లు

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 131.02 కోట్ల షేర్ ని రాబట్టిందని సమాచారం..

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, నివేతా పెతురాజ్, సుశాంత్ , తనికెళ్ళ భరణి మొదలగువారు కీలక పాత్రల్లో మేరిశారు. ఈ సినిమాని అల్లు అరవింద్‌, రాధకృష్ణలు సంయుక్తంగా గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం కొన్ని చోట్లలో నాన్ బాహుబలి రికార్డులని సైతం సొంతం చేసుకుంది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories