Ala Vaikuntapurramloo: KTR ని ఫిదా చేసిన 'సామజవరగమన' పాట

Ala Vaikuntapurramloo: KTR ని ఫిదా చేసిన సామజవరగమన పాట
x
Highlights

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో .. ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు ఎంత పెద్ద హిట్టు అయ్యయో పెద్దగా...

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో .. ఈ సినిమాకి తమన్ అందించిన పాటలు ఎంత పెద్ద హిట్టు అయ్యయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఒక్కో పాట ఒక్కో రికార్డును సృష్టించింది. ముఖ్యంగా సామజవరగమన పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేయడమే కాకుండా, ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉందంటే ఈ పాట ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

అయితే పాటపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న కేటీఆర్ అక్కడ మంచు కురుస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ సామజవరగమన పాటపై స్పందించారు. ప్రస్తుతం తెల్లవారుజామున 3.30 గంటలు అవుతుంది. ఇప్పుడు సామజవరగమన పాట నాకు కంపెనీ ఇస్తుందన్నారు కేటీఆర్. నా మైండ్ నుంచి ఈ పాట అసలు వెళ్లడం లేదంటూ, వాట్ ఏ బ్రిలియంట్ సాగ్ అంటూ తమన్ ని పొగడ్తలతో ముంచెత్తారు కేటీఅర్. ఈ పాటని ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, సిద్ శ్రీరామ్ అలపించారు. ప్రస్తుతం సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న చిత్ర టీంకి కేటీఆర్ చేసిన ట్వీట్‌ మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పాలి. '

సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది. జూలయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చి హ్యాట్రిక్ గా నిలిచింది. ఈ సినిమాలో టబు, మురళీశర్మ, సుశాంత్, సునీల్, నివేతా పెతురాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒవర్సిస్ లో కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories