Top
logo

పోస్టర్ పై డేట్ లేదు... అల వైకుంఠపురములో ఎప్పుడు వస్తుంది ?

పోస్టర్ పై డేట్ లేదు... అల వైకుంఠపురములో ఎప్పుడు వస్తుంది ?
X
Highlights

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో.....

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో.. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. పూజా హేగ్దే కథానాయకగా నటిస్తుంది. ఈ సినిమాని సంక్రాంతి పండగకు రిలీజ్ చేయనున్నారు..

ఇప్పటికే విడుదల తేదిన ప్రకటించింది చిత్ర బృందం.. వచ్చే ఏడాది 12న ఈ సినిమాని రిలీజ్ చేయబోతునట్టు ప్రకటించాయి. ఇదే తేదికి మహేష్ బాబు సరిలేరు నికేవ్వరు అనే సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నారు. రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడంతో ప్రేక్షకుల హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. కానీ రెండు సినిమాలు ఒకే టైంలో విడుదల కావడంతో ధియేటర్స్ కి కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల సినిమా నిర్మాతలు కూడా నష్టపోయే అవకాశం ఉంది.

అందుకే సినిమా విడుదల తేదీలను మార్చుకోవలని చిత్ర నిర్మాతలు సిద్దం అయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే తాజాగా బన్ని సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ ని విడుదల చేసారు. అందులో విడుదల తేదిన ప్రకటించలేదు. దానికి ముందు రిలీజ్ చేసిన పోస్టర్ లలో రిలీజ్ డేట్ ని మేన్షన్ చేసుకుంటూ వచ్చారు. దీనితో ముందుగా అనుకున్నట్టుగానే బన్ని సినిమాని 11 న విడుదల చేస్తున్నట్లు, మహేష్ సినిమాని 14 న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story