కరోనా టైంలో నాగ్ శివమణి వస్తే పూరి డైలాగ్స్ ఇలా!

కరోనా టైంలో నాగ్ శివమణి వస్తే పూరి డైలాగ్స్ ఇలా!
x
Akkineni Nagarjuna
Highlights

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా , డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శివమణి.

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా , డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శివమణి.. ఇందులో నాగ్ పోలిస్ పాత్రలో నటించాడు. పూరి డైలాగ్స్, అసిన్, రక్షిత అందాలు సినిమాని హిట్ మెట్టు ఎక్కించాయి. 2003 లో వచ్చిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా కరోనా నేపథ్యంలో ఆ సినిమాలోని ఓ సీన్‌ను నాగార్జున తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ నేను శివ‌మ‌ణి సినిమా చేస్తే, పూరీ జ‌గ‌న్నాథ్ డైలాగ్స్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంద‌ని నాగ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుత కరోనా పరిస్థితికి తగినట్టుగా ఆ సీన్లోని డైలాగ్స్‌ను మార్చి భవిరి రవి మిమిక్రీతో రూపొందించిన ఆ వీడియోను నాగ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.ఈ వీడియో చూసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. `ఈ వీడియో అద్భుతంగా ఉంది సర్` అని కామెంట్ చేశారు. ఇక ఈ సినిమా తరవాత వీరి కాంబినేషన్ లో సూపర్ అనే సినిమా తెరకెక్కింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories