అక్కినేని వారి అబ్బాయికి బర్త్ డే విషెస్

naga chaitanya
x
naga chaitanya
Highlights

అక్కినేని మూడో తరం కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు నాగచైతన్య.. వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమాతో చిత్ర...

అక్కినేని మూడో తరం కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు నాగచైతన్య.. వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.. 2009 లో ఈ సినిమా విడుదలైంది. అంటే నాగచైతన్య తన కెరియర్ ని సక్సెఫుల్ గా పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు.. ఈరోజు నాగచైతన్య తన 33 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్ ఆయనకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అక్కినేని నాగచైతన్య అక్కినేని నాగార్జున లక్ష్మీ దంపతుల కుమారుడు.. చదువు మొత్తం చెన్నై లొనే కంప్లీట్ చేసిన అనంతరం హైదరాబాద్ కి వచ్చి సినిమాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగానే జోష్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి నాగచైతన్యకి ఉత్తమ ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఏమాయ చేసావే సినిమా చైతూ కి మంచి విజయాన్ని ఇచ్చింది. ఆ తరవాత 100 % లవ్, తడాఖా,మనం లాంటి సినిమాలు నాగచైతన్య పరిపూర్ణమైన నటుడుగా తీర్చిదిద్దాయి.

చాలా కూల్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నాగచైతన్య.. చైతూ ప్రముఖ నటి సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇద్దరు సినిమాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య వెంకటేష్ తో కలసి వెంకీమామ అనే సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నాగచైతన్య ఇలాంటి సినిమాలు చేసి ప్రేక్షకులను మరింత అలరించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది హెచ్.ఎం.టీ.వీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories