'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' గా అక్కినేని అఖిల్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా అక్కినేని అఖిల్
x
Highlights

ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్ళు.. ఇప్పటికి హీరోగా చేసినవి మూడు సినిమాలు.. కానీ చెప్పుకోడానికి మాత్రం ఒక్క హిట్ కూడా లేదు. ఇది అక్కినేని మూడో తరం హీరో...

ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్ళు.. ఇప్పటికి హీరోగా చేసినవి మూడు సినిమాలు.. కానీ చెప్పుకోడానికి మాత్రం ఒక్క హిట్ కూడా లేదు. ఇది అక్కినేని మూడో తరం హీరో అక్కినేని అఖిల్ ట్రాక్ రికార్డు .. ఇంతవరకు మంచి సక్సెస్ ఉన్న దర్శకులతో పనిచేసిన అఖిల్ ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ లాంటి ప్లాపు డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి సినిమాని చేస్తున్నాడు. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మంగళవారం నాడు ప్రకటించబోతున్నారు.

అయితే ఈ సినిమాకి "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్" అనే టైటిల్ ని ముందు నుంచి అనుకుంటున్నారు. అయితే మరీ పెద్ద టైటిల్ అయితే బాగోదేమో అని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ కథకి సూట్ అవుతుందని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇందులో 'మోస్ట్ ఎలిజిబుల్ అన్నవి చిన్న లెటర్స్ గా, బ్యాచులర్ అన్నది పెద్ద లెటర్స్ గా లోగో వుంటుందని సమాచారం. రేపు (మంగళవారం ) సాయింత్రం 5:15 గంటలకు దీనిపైన క్లారిటీ రానుంది.

ఇక ఈ సినిమా సక్సెస్ ఇటు అఖిల్ కు, అటు భాస్కర్ కు ఇద్దరికీ అవసరమే.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సినిమాని సమ్మర్ లో రరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా అఖిల్ కి ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories